తెలంగాణ

telangana

ETV Bharat / state

'భయం వద్దు... ఈ అస్త్రాలు ఉంటే కరోనాపై జయం మనదే' - ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తాజా వార్తలు

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని... తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్​ను జయించవచ్చని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత పేర్కొన్నారు. కరోనాతో వారం రోజుల పాటు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన గొంగిడి సునీత దంపతులు శుక్రవారం డిశ్చార్చి అయ్యారు.

aleru mla gongedi sunitha
'భయం వద్దు... ఈ అస్త్రాలు ఉంటే కరోనాపై జయం మనదే'

By

Published : Jul 10, 2020, 11:15 PM IST

ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వ విప్​​ గొంగిడి సునీత, ఆమె భర్త నల్గొండ డీసీసీబీ ఛైర్మన్​ మహేందర్​ రెడ్డి... కరోనా నుంచి బయటపడ్డారు. కొవిడ్​తో వారం రోజుల పాటు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన వారిద్దరూ మహమ్మారి నుంచి కోలకుని శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.

వైరస్​ గురించి అపోహలు నమ్మొద్దని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ వైరస్ బారిన పడినప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సునీత పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు.. కొన్ని జాగ్రత్తలతో మహమ్మారిని జయించవచ్చని ఆమె అన్నారు. మహమ్మారి నుంచి వారు ఎలా కోలుకున్నారో ఆమె మాటల్లోనే...

'భయం వద్దు... ఈ అస్త్రాలు ఉంటే కరోనాపై జయం మనదే'

ఇదీ చూడండి:కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 1278 కేసులు.. మరో 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details