తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ టు ఆంధ్రా... డ్రమ్ముల్లో మద్యం అక్రమ రవాణా - తెలంగాణ టు ఏపీ అక్రమ రవాణా

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో మద్యం ధరలు ఎక్కువ ఉన్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరిహద్దులు దాటుతోంది. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల నుంచి మద్యం ఏపీకి తరలివెళ్తోంది. దీంతో మద్యం అక్రమ రవాణాపై అక్కడి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

తెలంగాణ టు ఏపీ... వాటర్ డ్రమ్ములో మద్యం అక్రమ రవాణా
తెలంగాణ టు ఏపీ... వాటర్ డ్రమ్ములో మద్యం అక్రమ రవాణా

By

Published : Jun 18, 2020, 8:36 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాకు తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతోంది. పెనుగంచిప్రోలులో మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని ఖమ్మం నుంచి మినీ వ్యాన్​లోని వాటర్ డ్రమ్ములో 2500 మద్యం సీసాలు ఉంచి రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుున్నారు. వీటిని విజయవాడకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details