తెలంగాణ

telangana

'అలయ్‌ బలయ్‌' ఐక్యతకు నిదర్శనం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అలయ్‌-బలయ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తే విజయలక్ష్మి నేతృత్వంలో వేడుకలు గురువారం అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్​ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్లు దత్తాత్రేయ, తమిళిసై సహా.. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. తెలంగాణ వంటకాలతో పాటు వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి.

By

Published : Oct 11, 2019, 6:44 AM IST

Published : Oct 11, 2019, 6:44 AM IST

Updated : Oct 11, 2019, 7:05 AM IST

'అలాయ్‌ బలాయ్‌' ఐక్యతకు నిదర్శనం

'అలయ్‌ బలయ్‌' ఐక్యతకు నిదర్శనం

విజయదశమిని పురస్కరించుకుని బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ఈసారి ఆయన కూమార్తే విజయలక్ష్మి గురువారం నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నియమితులు కావడం వల్ల ఈ బాధ్యతను ఆమె తీసుకున్నారు. జలవిహార్‌ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

పాటలతో సందడి చేసిన రసమయి

అంతకుముందు నిర్వహించిన వివిధ కళారూపాల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ స్వయంగా పాటలు పాడి అలరించారు. గిరిజనులు, కోయ, గోండ్లు తమ తమ వేషధారణలతో... నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. బోనాలు, బతుకమ్మ ఆటలతో మహిళలు, యువతులు సందడి చేశారు. గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కళాకారులతో కలిసి డోలు చప్పుళ్ల మధ్య ఆడిపాడారు.

మన సంస్కృతికి చిహ్నం

తెలంగాణలో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బతుకమ్మ, బోనాల పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గౌరవాన్ని పెంపొందింపజేస్తున్నాయని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అలయ్‌ బలయ్​లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కళలకు పుట్టినిల్లైన తెలంగాణకు గవర్నర్‌గా రావడం చాలా సంతోషంగా ఉందని తమిళిసై సంతోషం వ్యక్తం చేశారు. అలయ్‌ బలయ్‌ వేడుకల్లో భాగంగా... వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్లను దత్తాత్రేయ సన్మానించారు.

ఇవీచూడండి: జలవిహార్​లో సందడిగా అలయ్​ బలాయ్​

Last Updated : Oct 11, 2019, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details