రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 3 కిమీ అవగాహన పరుగును నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ సంచాలకుడు అకున్ సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు చేపట్టిన ఈ పరుగులో వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే వారి ప్రాణాలు కాపడవచ్చని అకున్ పేర్కొన్నారు. రోడ్డుపైనే వదిలేయకుండా వారికి ప్రాణదానం చేయాలని సూచించారు.
ప్రమాదంలో గాయపడ్డ వారికి ప్రాణదానం చేయాలి - రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాలి
ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు కొంత మంది జనం చూస్తూ ఉంటారు. అలా చేయకుండా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడాలని పౌర సరఫరాల శాఖ సంచాలకుడు అకున్ సబర్వాల్ కొరారు.
ప్రమాదంలో గాయపడ్డ వారికి ప్రాణదానం చేయాలి