తెలంగాణ

telangana

ETV Bharat / state

రవీంద్రభారతిలో ఆకృతి అవార్డుల వేడుకలు - తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆకృతి 29వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరయ్యారు. వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి రాజు సుశీల రంగారావు సంస్కార్ అవార్డులతో సత్కరించారు.

రవీంద్రభారతిలో ఆకృతి అవార్డుల వేడుకలు

By

Published : Sep 4, 2019, 5:19 PM IST

రవీంద్రభారతిలో ఆకృతి అవార్డుల వేడుకలు

ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా... కన్నతల్లిని, మాతృదేశాన్ని మర్చిపోవద్దని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆకృతి 29వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్ , ప్రముఖ వైద్యులు గురువారెడ్డి, భారత సైన్యం ఉన్నతాధికారి మేజర్ జనరల్ ఎం.శ్రీనివాసరావులను రాజు సుశీల రంగారావు సంస్కార్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీస్వరలయ సంగీత డాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details