చుట్టూ ఉండే పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అక్కినేని నాగార్జున అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లోని తన నివాసం సమీపంలో ఏర్పాటు చేస్తున్న జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం నాగార్జున శంకుస్థాపన చేశారు.
సొసైటీ పార్క్ కోసం మొక్క నాటిన నాగ్ - telangana news today
మన పరిసరాల్లో చెట్లు ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. పచ్చని చెట్లు ప్రగతిగా మెట్లుగా అభివర్ణించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సొసైటీ పార్క్ కోసం నాగ్ మొక్క నాటి శంకుస్థాపన చేశారు.

సొసైటీ పార్క్ కోసం మొక్క నాటిన నాగ్
సొసైటీ పార్క్ కోసం మొక్క నాటిన నాగ్
వాల్గో ఇన్ ఫ్రా ఎండీ శ్రీధర్ రావు, స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబులతో కలిసి సొసైటీ పార్క్ కోసం మొక్క నాటిన నాగార్జున... కాలనీలో పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో సొసైటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్క్‌లో ఎన్నో ప్రత్యేకమైన చెట్లను పెంచాలని.. కాలనీ వాసులంతా నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్క్ స్థలంలోని ఓ చెట్టు కింద కాసేపు సేదతీరిన ఆయన... కాలనీ వాసులతో ముచ్చటించారు. చెట్లు పెంచాలన్న కాలనీ వాసుల నిర్ణయాన్ని ప్రశంసించారు.
ఇదీ చూడండి :'కేజీఎఫ్ 2' సినిమాలో బాలకృష్ణ ఉన్నారా?