తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్జున జన్మదినం సందర్భంగా నిత్యావసరాల పంపిణీ - yuva samrat birthday celebrations

యువ సామ్రాట్​ అక్కినేని నాగార్జున జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కినేని ఫ్యాన్స్ .... సినిమా థియేటర్​ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని థియేటర్ల యాజమానులు కేక్​ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

akkineni-fans-association-distributed-groceries-to-theaters-workers-in-rtc-cross-road-hyderabad
నాగర్జున జన్మదినం సందర్భంగా నిత్యావసరాల పంపిణీ

By

Published : Aug 29, 2020, 4:59 PM IST

కొవిడ్ - 19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయ మార్గం చూపాల్సిన అవసరం ఉందని దేవి థియేటర్ యజమాని బాల గోవింద్ రాజ్ విన్నవించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్​ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని థియేటర్ల ఆధ్వర్యంలో.. కేక్​ కట్ చేసి జన్మదిన వేడుక జరుపుకున్నారు.. అనంతరం అక్కినేని ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కమిటీ ఆధ్వర్యంలో.. సినిమా థియేటర్ల సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

మహమ్మారి కారణంగా థియేటర్ల సిబ్బంది పరిస్థితి దీనంగా మారిందని.. వారికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో తమకు తోచిన సాయం అందిస్తున్నామని అక్కినేని ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి:అమాయకులే లక్ష్యం.. రూ. లక్షలు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details