రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'అఖిల తెలంగాణ రేషన్ డీలర్స్ ఫెడరేషన్'ను ఏర్పాటు చేసినట్లు.. సంస్థ అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో.. డీలర్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కాలంగా డీలర్లకు ఉన్న సమస్యలను వివరించారు.
'రేషన్ డీలర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా'
హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో.. రేషన్ డీలర్ల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వం.. తమకు గౌరవ వేతనం ఇవ్వాలంటూ డీలర్లు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి 33 జిల్లాలకు చెందిన డీలర్లు హాజరయ్యారు.
రేషన్ డీలర్ల సమస్యలు
రేషన్ డీలర్ల సమస్యలను.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, రెండు నెలల్లో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని రవీందర్ తెలిపారు. డీలర్లకు.. జీతం-కమీషన్ అంశాలతో పాటు కేరళ, తమిళనాడులో అమలవుతోన్న విధానం గురించి చర్చించి... త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామని వివరించారు. ఈ సమావేశానికి 33 జిల్లాలకు చెందిన డీలర్లు హాజరయ్యారు.
ఇదీ చదవండి:రాష్ట్రానికి మరో టెక్స్‌టైల్ కంపెనీ.. 1100 మందికి ప్రత్యక్ష ఉపాధి