బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భర్త భార్గవ్ రామ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. కిడ్నాప్ ఘటన జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితులు.... సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోతున్నట్లు వెల్లడించారు. కిడ్నాప్ వ్యవహారంలో అన్ని విధాలా పోలీసులకు సహకరిస్తామని తెలిపారు.
బోయిన్‌పల్లి పీఎస్‌లో లొంగిపోయిన అఖిలప్రియ భర్త, సోదరుడు - బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు లొంగిపోయిన భార్గవ్‌రామ్
17:03 March 22
బోయిన్‌పల్లి పీఎస్‌లో లొంగిపోయిన అఖిలప్రియ భర్త, సోదరుడు
ఇదీ జరిగింది..
జనవరి 5న రాత్రి సమయంలో ఆదాయపన్ను అధికారులమంటూ.... సీఎం కేసీఆర్ సమీప బంధువు, జాతీయ బ్యాడ్మింటన్ మాజీ ఆటగాడైన ప్రవీణ్‌రావు ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌రావు సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో జనవరి 5న అపహరించారు.
ఐటీ అధికారులమంటూ ప్రవీణ్‌రావు ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి... ప్రవీణ్, ఆయన సోదరులను కిడ్నాప్‌చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏ1 భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 22న అఖిలప్రియను బెయిల్‌పై విడిచిపెట్టారు. కేసులో ఇతర నిందితులైన భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి ఇన్నాళ్లు పరారీలో ఉన్నారు. ఇవాళ బోయిన్‌పల్లి పీఎస్‌కు వచ్చిన జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరామ్... పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇదీ చూడండి:కిడ్నాప్ కేసు: భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి సహా ఆరుగురికి బెయిల్