ఎస్సీ, ఎస్టీ, గిరిజనులపై దాడులను నిరసిస్తూ... అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ఆందోళనకు దిగింది. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించింది. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా... ప్రతియేటా హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
'ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు వెంటనే ఆపేయాలి' - attacks on sc, st
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ధర్నా నిర్వహించింది. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా... ప్రతియేటా హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు, వేధింపులు ఆపకపోతే... పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
!['ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు వెంటనే ఆపేయాలి' akhila bharata sc, st samakya protest in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7667088-370-7667088-1592471569217.jpg)
ఇందుకు ఉదాహరణ భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన కాల్వ దేవదాస్ అనే రైతు ఐదెకరాల వ్యవసాయ భూమిని... స్థానిక తెరాస నేత పొన్నాల నాగరాజు కొందరు అసాంఘిక శక్తులతో కలసి కబ్జా చేశారని ఆరోపించారు. పాక్షికంగా ఇంటిని, పంటను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించారని... దీనికి పోలీసులు కూడా వత్తాసు పలకడమే కాకుండా... దేవదాసుపైన అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు కాల్వ దేవదాస్ భూమిని కాపాడి... దాడులకు పాల్పడ్డ భూకబ్జాదారులపై , పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు, వేధింపులు ఆపకపోతే... పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.