Akhanda Movie unit in simhachalam: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆయనతో పాటు అఖండ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నిర్మాత రవీందర్‌రెడ్డి కూడా సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు.
Akhanda unit in Simhachalam: అప్పన్న సన్నిధిలో 'అఖండ' చిత్ర యూనిట్ - simhachalam
Akhanda Movie unit in simhachalam: ఏపీ విశాఖ సింహాద్రి అప్పన్నను అఖండ చిత్ర బృందం దర్శించుకున్నారు. సినిమా కథానాయకుడు బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు.
అప్పన్న సన్నిధిలో 'అఖండ' చిత్ర యూనిట్
వేద మంత్రాల నడుమ ఆలయ అధికారులు చిత్ర బృందానికి స్వాగతం పలికారు. చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ స్వామివారికి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందించారు.