తెలంగాణ

telangana

ETV Bharat / state

Akhanda Team visit Indrakeelardi: కథ నచ్చితే మల్టీస్టారర్​కు రెడీ: బాలకృష్ణ - అఖండ చిత్రబృందం తాజా వార్తలు

Akhanda Team visit Indrakeelardi: ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని అఖండ చిత్ర బృందం దర్శించుకుంది. బాలకృష్ణ, బోయపాటి.. కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శకులు మంచి కథతో వస్తే.. మల్టీస్టారర్‌ చేస్తానని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Akhanda Team visit Indrakeelardi, Akhanda Team
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ

By

Published : Dec 15, 2021, 8:56 AM IST

Updated : Dec 15, 2021, 9:20 AM IST

Akhanda Movie Team Visit Vijayawada Durga Temple: ఏపీలోని విజయవాడలో అఖండ చిత్ర బృందం సందడి చేసింది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను బాలకృష్ణ, బోయపాటి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి బాలకృష్ణ సంప్రదాయ దుస్తులతో వచ్చారు.

అఖండ ఘనవిజయం సాధించడం పట్ల బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా అఖండ అని అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలకృష్ణ పేర్కొన్నారు. అఖండ విడుదలై ఘన విజయం సాధించాక ధైర్యం వచ్చిందన్న నందమూరి నట సామ్రాట్.. కథ నచ్చితే మల్టీస్టారర్‌ చేస్తానని తెలిపారు.

ఏపీలో టికెట్ విధానంపై చిత్రం విడుదలకు ముందు చర్చించాం. ఆంధ్రా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం. చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడతాం.

- బాలకృష్ణ

అంతకుముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సినీనటుడు బాలకృష్ణ, అఖండ సినిమా బృందానికి బొర్రా గాంధీ, కరుణాకర్ బృందం స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో బాలయ్యతో సెల్ఫీలు తీసుకొనేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడినుంచి నేరుగా విజయవాడ దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ

ఇదీ చదవండి..Nagaland Army killings: మోన్​ మారణకాండకు బాధ్యులెవరు?

Last Updated : Dec 15, 2021, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details