Akbaruddin Owaisi later to Metro MD: హైదరాబాద్లోని పాతబస్తీలో మెట్రోరైలు పనులను తక్షణమే ప్రారంభించాలని మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసిన ఆయన మెట్రో పనులు వేగవంతం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. నగరంలోని ఇమ్లీబన్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో కారిడర్ పనులు చేపట్టాలని చాలా కాలంగా కోరుతున్నామని.. తమ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినట్లు ఆయన తెలిపారు.
పాతబస్తీలో మెట్రో పనులు వేగవంతం చేయాలి.. అక్బరుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి - ఇమ్లీబన్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో పనులు
Akbaruddin Owaisi later to Metro MD: హైదరాబాద్లోని పాతబస్తీలోని మెట్రోరైలు పనులను తక్షణమే ప్రారంభించాలని మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసిన ఆయన మెట్రో పనులు వేగవంతం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. తమ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినప్పటకీ పనులు ఆలస్యం కావడం ఆశ్ఛర్యంగా ఉందన్నారు.

Akbaruddin Owaisi
ఐదున్నర కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు పనులు నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని కోరారు. త్వరితగతిన పనులు ప్రారంభించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదని ఒవైసీ వాపోయారు. 2022-23 బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ పనుల ప్రారంభంలో ఆలస్యం కావడం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: