తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ - Telangana assembly meetings

Akbaruddin Owaisi as Telangana Protem Speaker : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని రేవంత్‌ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని నియమించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Akbaruddin Owaisi as Telangana Protem Speaker
Akbaruddin Owaisi

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 1:42 PM IST

Updated : Dec 8, 2023, 3:25 PM IST

Akbaruddin Owaisi as Telangana Protem Speaker :తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనే చర్చకు తెరపడింది. అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్‌ చేత గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణస్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అక్బరుద్దీన్‌ ఓవైసీ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

Akbaruddin Owaisi Appointed as Protem Speaker of Telangana : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనసభ తొలి సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు.

నేడు సీఎం రేవంత్​ రెడ్డితో ఆర్టీసీ ఎండీ భేటీ - ఉచిత ప్రయాణం మార్గదర్శకాలపై చర్చ

Akbaruddin Owaisi as Protem Speaker of Telangana Legislative Assembly :అయితే ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో కాలు జారీ పడడంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే బీఆర్‌ఎస్‌కు చెందిన ఇతర సభ్యుల్లో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్‌ ఆరుసార్లు ఎన్నికైన శాసనసభ్యులు. అలాగే ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఇద్దరూ మంత్రులుగా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ నేతలు ఇద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో, రేవంత్‌ రెడ్డి సర్కారు అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గుచూపింది. అయితే ప్రొటెం స్పీకర్‌ ఎవరు? అన్న ప్రశ్నలకు నేటితో తెరపడినట్లు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ వినతిని అక్బరుద్దీన్‌ స్వీకరించినట్ల తెలుస్తోంది. కాగా, అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా రేపు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సమాచారం.

ప్రజా దర్బార్​కు అనూహ్య స్పందన - తమ సమస్యలను సీఎంకు విన్నవించుకున్న ప్రజలు

Last Updated : Dec 8, 2023, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details