తెలంగాణ

telangana

ETV Bharat / state

'దళారులను నమ్మి మోసపోవద్దు' - AKBARUDDHIN OWAISI DISTRIBUTED KALYANA LAKSHMI CHEQUES3

హైదరాబాద్​ పాతబస్తీలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పంపిణీ చేశారు. దళారులను ఆశ్రయించొద్దని లబ్ధిదారులు ఎమ్మెల్యే హితవు పలికారు.

పాతబస్తీ చంద్రాయణ గుట్టలో షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పాతబస్తీ చంద్రాయణ గుట్టలో షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

By

Published : Feb 23, 2020, 11:21 AM IST

హైదరాబాద్​ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. లబ్ధిదారులకు 708 చెక్కులను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అందజేశారు. పథకాల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని... లబ్ధిదారులకు అన్యాయం జరగదని ఎమ్మెల్యే తెలిపారు.

బండ్లగూడ మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బండ్లగూడ తహసీల్దార్ ఫర్హీన్ షేక్, రియసత్ నగర్ కార్పొరేటర్ సలీమ్ బేగ్ , హఫీజ్ పటేల్, ఎంఐఎం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

పాతబస్తీ చంద్రాయణ గుట్టలో షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి : రేపటి నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details