మైనార్టీల విద్యా, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠశాలలు మంచి ఫలితాలనిచ్చే దిశగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుడు ఏకే ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ముషీరాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
'గురుకుల పాఠశాలలు మంచి ఫలితాలిస్తున్నాయి' - హైదరాబాద్‌లోని గురుకుల పాఠశాలను సందర్శించిన ఏకే ఖాన్
హైదరాబాద్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాల ఆ శాఖ సలహాదారు ఏకే ఖాన్ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు.
'గురుకుల పాఠశాలలు మంచి ఫలితాలిస్తున్నాయి'
గురుకుల పాఠశాలలోని నర్సరీ చిన్నారులతో ముచ్చటించి వారి ప్రతిభను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యార్థులు గురుకులాన్ని సద్వినియోగం చేసుకొని అన్నిరంగాల్లో రాణిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఓ ముఖ్యమంత్రి ఊపిరిపోసిన విజ్ఞాన గనికి ఇప్పుడేమైంది?