కొవిడ్ బారినపడి మరణించిన వారి కోసం ప్రత్యేకంగా సహారా అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అడ్వైజరీ ఏకే ఖాన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని ప్యాలెస్‌లో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 7569600800 హెల్ప్‌లైన్ నెంబర్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు.
'కొవిడ్ మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్' - రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అడ్వైజరీ ఏకే ఖాన్
సికింద్రాబాద్‌లోని లీ రాయల్ ప్యాలెస్‌లో హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొవిడ్ బారినపడి మృతిచెందిన వారి కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అడ్వైజరీ ఏకే ఖాన్ ప్రారంభించారు.
!['కొవిడ్ మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్' ak khan started free ambulances at le palace in secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8236289-154-8236289-1596121771981.jpg)
'కొవిడ్ మృతదేహాల తరలింపునకు ముందుకు రావడం అభినందనీయం'
కరోనా మృతదేహాలను తరలించే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని ఏకే ఖాన్ పేర్కొన్నారు. కొవిడ్ మృతులకు అందిస్తున్న ఈ సహకారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని, విధిగా మాస్కులు ధరించాలని కోరారు.
ఇదీచూడండి: రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధికి పటిష్ఠ చర్యలు: తలసాని
TAGGED:
ఏకే ఖాన్ తాజా వార్తలు