హైదరాబాద్ పాతబస్తీలోని సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహించిన భారత ముస్లిం మహిళా ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ పాల్గొన్నారు. 20వ శతాబ్దంలో ముస్లిం మహిళలు స్వాతంత్ర ఉద్యమం, సామాజిక రంగాల్లో ఏ విధంగా పాల్గొన్నారో వివరించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఇతర స్కూళ్ల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
సాలార్జంగ్ మ్యూజియంలో మహిళా ఫోటో ఎగ్జిబిషన్ - ak khan
పాతబస్తీలోని సాలార్జంగ్ మ్యూజియంలో 20వ శతాబ్దపు భారత ముస్లిం మహిళా ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
![సాలార్జంగ్ మ్యూజియంలో మహిళా ఫోటో ఎగ్జిబిషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4036678-485-4036678-1564900619162.jpg)
భారత ముస్లిం మహిళా ఫోటో ఎగ్జిబిషన్లో ఏకే ఖాన్