ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నించే ఆచార్య నాగేశ్వర్‌ను గెలిపించాలని... ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని యూనియన్ నేతలు కోరారు. అనంతరం యూనియన్ రూపొందించిన... నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను గెలిపించండి: ఏఐటీయూసీ - aituc mlc meeting
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను గెలిపించాలని... ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రచార వాల్ పోస్టర్‌ను యూనియన్ నేతలు ఆవిష్కరించారు.
![ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను గెలిపించండి: ఏఐటీయూసీ AITUC Auto Rickshaw Drivers Union appeals to win over Professor Nageshwar. Union leaders then unveiled an election campaign wall poster.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10876571-32-10876571-1614913741200.jpg)
ప్రోఫెసర్ నాగేశ్వర్‌ను గెలిపించండి: ఏఐటీయూసీ
ఏ అంశంపైనైనా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించే ఆచార్య నాగేశ్వర్‌కు వామపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు, ప్రజాతంత్రవాదులు బలపరుస్తున్నారని తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దొరకక ఆటో డ్రైవర్లలలో 90 శాతం మంది పట్టభద్రులెనని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఫుర్తిగా విఫలమైందని... ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ది చెప్పాలని పట్టభద్రులను కోరారు.
ఇదీ చదవండి:మొదట నుంచి చిన్న కన్ఫ్యూజన్ ఉండేది: నవదీప్