ప్రైవేటు యూనివర్సిటీలు- పర్యవసానాలపై అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ కౌన్సిల్ హైదరాబాద్‌లో.. రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. హిమాయత్‌నగర్‌లోని మగ్దుమ్ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ కేజీ టూ పీజీ విధానాన్ని తుంగలో తొక్కిందని నాయకులు మండిపడ్డారు.
అంగడి సరకుగా...
విద్యను అంగడి సరకుగా మార్చేందుకు ఐదు ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువచ్చిందని ఆరోపించారు. వాటిలో మూడు యూనివర్సిటీలను తెరాస నాయకులకు కట్టబెట్టి.. ప్రభుత్వ విద్యపై కపట ప్రేమ చూపిస్తుందని అన్నారు.
ప్రభుత్వ యూనివర్సిటీల్లో 3000కు పైగా అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రైవేటు యూనివర్సిటీల ప్రతిపాదనను ప్రభుత్వం వెనుక్కి తీసుకోవాలని లేనిపక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.
ఇదీ చదవండి:కెనడాలో వనస్థలిపురం విద్యార్థి మృతి..