తెలంగాణ

telangana

సాగు చట్టాలను రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు: శివరామకృష్ణ

By

Published : Jan 4, 2021, 3:35 PM IST

Updated : Jan 4, 2021, 3:45 PM IST

కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను వెంటనే రద్దుచేయాలని ఏఐఎస్​ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ తెలిపారు. దిల్లీలో రైతుల దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చినా.. పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు.

aisf-demands-to-cancel-the-new-farm-laws-and-they-protest-in-hyderabad
సాగు చట్టాలను రద్దే చేసేవరకూ పోరాటం ఆగదు: శివరామకృష్ణ

సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలి: శివరామకృష్ణ

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో ఏఐఎస్​ఎఫ్, ఏఐవైఎఫ్​ల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఏఐటీయూసీ భవన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించగా పోలీసులు అనుమతించలేదు. ఈక్రమంలో నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోలీసులకు వ్యతిరేకంగా శ్రేణులు భారీగా నినాదాలు చేశారు.

కార్పొరేట్ శక్తుల కోసమే చట్టాలు...

మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని ఏఐఎస్​ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. కార్పొరేట్ శక్తుల సూచనల మేరకే, వారికి లబ్ధి చేకూర్చేందుకే వ్యవసాయ చట్టాలు రూపొందించారని ఆరోపించారు. దిల్లీలో రైతుల దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. చలిలో వణుకుతూ రైతులు దీక్షలు చేస్తుంటే.. కొందరు భాజపా నేతలు ఆ ఉద్యమం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగు చట్టాలు రద్దు చేసేవరకూ పోరాడుతామని చెప్పారు. దిల్లీలో రైతులు దీక్ష విరమించేవరకూ మద్దతుగా నిలుస్తామని భరోసానిచ్చారు.

ఇదీ చదవండి:ట్రాలీఆటో బోల్తా... 18 మందికి గాయాలు

Last Updated : Jan 4, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details