మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా రేపు కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించనున్నామని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తెలిపారు. సాగు చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమం... ప్రత్యేకించి దిల్లీలో శాంతియుత పోరాటంలో అమరులైన రైతులను స్మరించుకుంటూ ఈ ర్యాలీలు సాగుతాయని తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'సాగు చట్టాలకు వ్యతిరేకంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ' - తెలంగాణ వార్తలు
సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రమంతటా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ప్రకటించారు. దిల్లీ దీక్షలో అమరులైన అన్నదాతలను స్మరించుకుంటూ ఈ ర్యాలీ చేపడుతున్నట్లు వివరించారు.
!['సాగు చట్టాలకు వ్యతిరేకంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ' aiscc-candle-rally-to-support-delhi-farmers-protest-in-telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9937904-568-9937904-1608385878045.jpg)
'సాగు చట్టాలకు వ్యతిరేకంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీలు'
మూడు వ్యవసాయ చట్టాలు రద్దు, విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న రైతుల ఉద్యమం పట్ల కేంద్రం తీవ్ర ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తరుణంలో... ఈ పోరాటం మరింత ఉద్ధృతం చేసి మోదీ సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపుతో ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయనున్నామని సాగర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కోహ్లీసేన చెత్త రికార్డు.. అసలేమైంది వీరికి!