హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎయిర్టెల్ మారథాన్ 9వ ఎడిషన్ ట్రోఫీని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ నెల 24,25న జరిగే ఈ మారథాన్‌కు పోలీసుల మద్దతు ఉంటుందని సీపీలు తెలిపారు. గతేడాది కంటే ఈ సారి పాతికవేల మందికి పైగా పాల్గొననున్నారని అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. 5కె సీఎక్స్ఓ రన్, కాస్ట్యూమ్ డ్యాష్ పోటీ, 10 కె రన్, హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులివ్వనున్నట్లు తెలుగు రాష్ట్రాల ఎయిర్టెల్ సీఈఓ తెలిపారు.
'ఎయిర్టెల్ మారథాన్‌కు పోలీసుల సహకారం' - రన్నర్స్ అసోసియేషన్
ఈ నెల 24,25న హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మారథాన్‌కు పోలీసుల సహకారం ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
'ఎయిర్టెల్ మారథాన్‌కు పోలీసుల మద్దతు ఉంటుంది'