ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నగరంలో ఆ రాష్ట్ర సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సింధియా-షీలానగర్, ఎయిర్‌పోర్ట్ మార్గాల్లో చాలా సేపు వాహనాలను నిలిపివేశారు. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పోలీసుల అత్యుత్సాహం.. విమాన ప్రయాణికుల ఇబ్బందులు - సీఎం జగన్ విశాఖ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫలితంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్టుకు వచ్చే రహదారుల్లో 3 గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సింధియా, షీలానగర్ ప్రాంతాల్లోని విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పోలీసుల అత్యుత్సాహం.. విమాన ప్రయాణికుల ఇబ్బందులు
అరగంటైనా అనుమతి ఇవ్వకపోవడంతో కొంతమంది తమ లగేజీతో కాలినడకనే వెళ్లారు. పోలీసుల వైఖరిపై విమాన ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఓ మహిళ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము ఎక్కాల్సిన విమానం వెళ్లిపోతే టికెట్ ఛార్జీలు ఇస్తారా? అని మండిపడ్డారు.