గాల్లో కలిసే కాలుష్య ఉద్గారాల్లో పీఎం 2.5, సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 10), సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ముఖ్యమైనవి. తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములు. పీఎం 10 అంటే.. తల వెంట్రుకకు అయిదింతలు తక్కువ అన్న మాట. స్వచ్ఛమైన గాలిని ఇది కలుషితం చేస్తుంది. అనారోగ్య సమస్యలకు కారణమయ్యే అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) ఈ దీపావళికి ‘దుమ్ము’ రేపాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలిని పీలిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీఎం2.5 విషయానికొస్తే.. తల వెంట్రుక మందంలో 20 రెట్లు తక్కువగా ఉంటుంది. పీఎం 10తో పోలిస్తే అత్యంత ప్రమాదకరం.
నివాసిత ప్రాంతాల్లో ‘మోత’
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఆదేశాల మేరకు నగరంలో వాయు, శబ్ద కాలుష్యంపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. సాధారణ రోజు(అక్టోబరు 29న), దీపావళి రోజు తీవ్రతను లెక్కించింది. ఆ గణాంకాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. సాధారణ రోజుల్లో కంటే పీఎం 2.5 తీవ్రత భారీగా పెరిగింది. ఆశ్చర్యకరంగా సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ తీవ్రత పండుగ రోజు తగ్గింది. జూబ్లీహిల్స్, తార్నాక తదితర ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం భారీగా పెరిగింది.
ఇదీ చూడండి:Green Crackers: పర్యావరణ హిత టపాసులు.. కాలుష్యం తగ్గే అవకాశం