తెలుగు రాష్ట్రాల నుంచి విమానాల్లో ప్రయాణించిన స్వదేశీ, విదేశీ ప్రయాణికుల సంఖ్య(Air Passenger Statistics) సెప్టెంబర్ నెలలో భారీగా పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రెండు రాష్ట్రాల నుంచి 7,87,547 మంది ప్రయాణించగా... ఈ ఏడాది సెప్టెంబర్లో ఏకంగా 12,67,969 మంది ప్రయాణించినట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిన గణాంకాలు(Air Passenger Statistics) స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తీసుకుంటే గత ఏడాదిలో 22,71,976 మంది మాత్రమే ప్రయాణాలు చేయగా... ఈసారి అదే ఆరు నెలల్లో ఏకంగా 54,01,042 మంది ప్రయాణించారు. గతేడాది కంటే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య రెట్టింపునకు మించింది.
వివరాలు ఇలా..
రెండు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల వారీగా ప్రయాణికుల వివరాలను( Air Passenger Statistics) పరిశీలించినట్లయితే...శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గతేడాది సెప్టెంబర్ నెలలో 38,324 మంది విదేశాలకు రాకపోకలు సాగించారు. ఈ ఏడాది అదే నెలలో 1,15,000 మంది ప్రయాణించారు. విశాఖపట్నం నుంచి అయితే.. విదేశీ ప్రయాణాలు 5మంది మాత్రమే చేయగా... విజయవాడ నుంచి 2,815 మంది ప్రయాణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి గత సంవత్సరం 1,06,821 మందికాగా... ఈ ఏడాది అదే ఆరు నెలల్లో ఏకంగా 4,18,979 మంది ప్రయాణించారు.