ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఎయిర్‌ఫోర్స్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నాకు దిగింది. సికింద్రాబాద్ హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఎదురుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్నే మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ విధానం అమలుకై ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల ధర్నా!
ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఎయిర్‌ఫోర్స్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని.. పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని యూనియన్ ఉపాధ్యక్షులు రంజిత్ అన్నారు.
పాత పెన్షన్ విధానం అమలుకై ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల ధర్నా!
పెన్షన్ ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నదని ఎయిర్‌ఫోర్స్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ అన్నారు. పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే.. యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు.