తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో మరోసారి గళమెత్తిన ముస్లింలు - సీఏఏకు వ్యతిరేకంగా పాతబస్తీలో ముస్లింల సభ

సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు మరోసారి గళమెత్తారు. బిల్లు సవరణ తమకు ఆమోదయోగ్యం కాదంటూ జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ అసదుద్దీన్ నాయకత్వంలో జరిగిన ఈ ర్యాలీలో ముస్లింలు భారీగా పాల్గొన్నారు.

Aimim president comments over the caa
సీఏఏను వ్యతిరేకిస్తూ.. ముస్లింల సభ

By

Published : Jan 10, 2020, 7:34 PM IST

Updated : Jan 10, 2020, 10:51 PM IST


సీఏఏను ఉపసంహరించుకోవాలని, ఎన్ఆర్​ని రద్దు చేయాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఏఏను వ్యతిరేకిస్తూ.. భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ముస్లింలు జాతీయజెండాలు చేతబూని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తూ..బహిరంగ సభ

అనంతరం శాస్త్రిపురంలో ఎన్ఆర్​సీ, ఎన్ఆర్​పీ, సీఏఏను వ్యతిరేకిస్తూ.. భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో వివిధ సంఘాల నేతలు, ముస్లిం మతపెద్దలు, మహిళా సంఘాల నాయకులు, వివిధ వర్గాలవారు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న వాళ్లకు పలు ముస్లిం సంఘాలు మంచినీళ్లు, అల్పాహారం అందించారు.

జనవరి 25న ముషాయిరా..

జనవరి 25న చార్మినార్ వద్ద ముషాయిరాను ఏర్పాటు చేస్తామని... అర్ధరాత్రి దాటగానే జాతీయజెండాను ఆవిష్కరించి గణతంత్ర్య వేడుకలు జరుపతామన్నారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో అన్ని వర్గాలవారు హాజరుకావాలని అసదుద్దీన్ సూచించారు. జనవరి 30న బాపూఘాట్ వద్ద పెద్దఎత్తున మానవహారం నిర్వహిస్తామన్నారు. ఈ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసుల బందోబస్తు..

వాహనాల రాకపోకలకు అంతరాయం తలెత్తకుండా దారి మళ్లించారు. ఆరాంఘర్ నుంచి ఎంజీబీఎస్​కు వచ్చే వాహనాలన్నింటిని మెహదీపట్నం, చంద్రాయణగుట్ట మీదుగా దారి మళ్లించారు. టాస్క్​ఫోర్స్, ప్రత్యేక పోలీసులు, ఎస్ఓటీ, రాపిడ్ యాక్షన్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ నుంచే కాకుండా... రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్​కు చెందిన పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొన్నారు.

సీఏఏను వ్యతిరేకిస్తూ.. ముస్లింల సభ

ఇవీ చూడండి: ఫిరాయింపుల బెడద.. కాంగ్రెస్ కొత్త పంథా

Last Updated : Jan 10, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details