బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఓటు వేసి 5 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు. చారిత్రాత్మకమైన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్జేడీ, భాజపాలలో దేనికి మద్దతు ఇవ్వాలనే అంశాన్ని తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. కిషన్‌గంజ్‌లో ఓడిపోయామని... వచ్చే ఎన్నికల్లో ప్రయత్నిస్తామని తెలిపారు.
'బిహార్ లో 5 స్థానాల్లో గెలవడం చారిత్రాత్మకం' - అసదుద్దీన్ తాజా వార్తలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఓటు వేసి 5 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు...ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు.
'బిహార్ లో 5 స్థానాల్లో గెలవడం చారిత్రాత్మకం'
ఉత్తర్ ప్రదేశ్, బంగాల్‌లో కూడా పోటీ చేయనున్నట్టు వివరించారు. సీమాంచల్‌లో సరైన వైద్య, ఆరోగ్య వసతులు లేవని... అక్కడ అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టికల్ 371 మాదిరిగా ఒక ప్రాంతీయ అభివృద్ధి చేయాలని కర్ణాటక- హైదరాబాద్ అభివృద్ధి మాదిరిగా చేయాలని గతంలో పార్లమెంట్ లో డిమాండ్ చేశానని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.