తెలంగాణ

telangana

ETV Bharat / state

'పీఆర్సీపై ఐక్యవేదిక నేతలను చర్చలకు పిలవాలి'

పీఆర్సీపై సీఎస్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రిసభ్య కమిటీ సమావేశాలకు ఐక్య వేదికలోని 79 భాగస్వామ్య సంఘాలను పిలవాలని ఐక్య వేదిక సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. ఐక్య వేదికలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించి... 47.5 శాతం ఫిట్​మెంట్​తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

'ఐక్యవేదికలోని భాగస్వామ్య సంఘాలను చర్చలకు పిలవాలి'
'ఐక్యవేదికలోని భాగస్వామ్య సంఘాలను చర్చలకు పిలవాలి'

By

Published : Jan 28, 2021, 4:48 PM IST

పీఆర్సీ చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రిసభ్య కమిటీ సమావేశాలకు ఐక్య వేదికలోని 79 భాగస్వామ్య సంఘాలను పిలవాలని ఐక్య వేదిక డిమాండ్ చేసింది. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మధ్య విభజించి పాలించు చందంగా వ్యవహరిస్తోందని సంఘం నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో రెండు సంఘాలనే ప్రభుత్వం ఆహ్వానించడం... మిగిలిన సంఘాలను అవమానించడమేనని అన్నారు. పీఆర్సీ అనేది ఉద్యోగులకు వేసే భిక్ష కాదని... అది తమ హక్కు అని తెలిపారు.

7.5 ఫిట్​మెంట్​తో ప్రకటించిన పీఆర్సీను ప్రతి ఒక్క ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని... ఉద్యోగుల మధ్య ఉన్న భయాందోళనను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉందన్నారు. ఇప్పటికైనా ఐక్య వేదికలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించి... 47.5 శాతం ఫిట్​మెంట్​తో పీఆర్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఉద్యోగులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details