తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ' - నవంబరు 5న రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్​సీసీ

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేఎస్‌సీసీ ప్రతినిధులు... రాస్తారోకోలు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు.

'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'
'ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన ఏఐకేఎస్‌సీసీ'

By

Published : Nov 2, 2020, 3:26 PM IST

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టాలని ఏఐకేఎస్​సీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమవేశంలో ఆ సమితి సభ్యులు నిరసన ప్రదర్శనకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం సవరణ, స్వేచ్ఛా మార్కెట్, కాంట్రాక్టు వ్యవసాయం తదితర చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఏఐకేఎస్‌సీసీ డిమాండ్ చేసింది. వాటితో పాటు పాటు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని... నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. అన్నదాతలకు పరిహారం చెల్లించి... సన్నరకం వరిని క్వింటాల్‌ 2,500 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని కోరారు. సమావేశంలో ఏఐకేఎస్‌సీసీ ప్రతినిధులు తీగల సాగర్, పశ్య పద్మ, కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్, వేములపల్లి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం

ABOUT THE AUTHOR

...view details