AIG Study On Mixed Vaccines: మనదేశంలో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను మొదటి, రెండో డోసులుగా తీసుకోవటం సురక్షితమేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ రకమైన టీకాల మేళవింపు యాంటీబాడీ ప్రతిస్పందనను పెంపొందించటమే కాక.. సురక్షితమేనని తమ అధ్యయనంలో తేలిందని ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. టీకా వేసుకోని.. కొవిడ్ వ్యాధి సోకని 330 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లపై ఆధ్యయనం చేసినట్లు వెల్లడించారు. ప్రతికూల ప్రభావాలు తెలుసుకోవటానికి 60 రోజుల పాటు పరిశీలించినట్లు స్పష్టం చేశారు.
AIG Study On Mixed Vaccines: ' ఆ రెండు టీకాల మేళవింపుతో మెరుగైన రక్షణ' - కొవాగ్జిన్, కొవిషీల్డ్
AIG Study On Mixed Vaccines: టీకాల మేళవింపుతో కొవిడ్ నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తుందని ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. టీకాల మేళవింపు వల్ల ప్రయోజనాలు, ఏమేరకు సురక్షితంపై ఏఐజీ అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ మేళవింపుల విశ్లేషణపై దేశంలో జరిగిన మొట్టమొదటి అధ్యయనం ఇదేనని ఆయన వెల్లడించారు.
Mixed vaccines for covid: ఒకేరకం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కన్నా.. రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో స్పైక్ ప్రోటీన్ ప్రతిరోధకాల ప్రతిస్పందన నాలుగు రెట్లు పెరిగిందని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు ప్రకటించారు. టీకాల మేళవింపు ఒమిక్రాన్ వేరియంట్‌పై మెరుగైన ప్రభావాన్ని చూపిస్తోందని ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. జనవరి పదో తేదీ నుంచి ప్రారంభమయ్యే బూస్టర్ డోస్ ఇచ్చేటప్పుడు తమ అధ్యయనాన్ని ఓ సూచనప్రాయంగా తీసుకోవాల్సిందిగా ఐసీఎంఆర్‌కు ఆయన విన్నవించారు.
- ఇవీ చూడండి:
- '81% కేసులు ఒమిక్రాన్‌వే'.. సాధారణ జ్వరంలాంటిదేనన్న సీఎం!
- 'పిల్లలకు కరోనా టీకా- ఈ విషయం మరవొద్దు'
- ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా?
- కొవిడ్ వ్యాక్సిన్ అని చెప్పి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్
- 'బూస్టర్ డోసుగా ఆ వ్యాక్సిన్ ఉత్తమం'
- Covid vaccines India: భారత్‌లో 12కు చేరిన టీకాలు, ఔషధాల సంఖ్య
- 'ప్రికాషన్ డోసు కోసం వారికి ఆ సర్టిఫికెట్ అవసరం లేదు'