అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ప్రథమ మహాసభలు హైదరాబాద్లో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుకన్య తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో ఈ నెల 29, 30 డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే ప్రథమ మహాసభ గోడ పత్రికను సమాఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు.
ఏఐఎఫ్డీడబ్యూ ప్రథమ మహాసభల గోడ పత్రిక
హైదరాబాద్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ప్రథమ మహాసభలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు.
ఏఐఎఫ్డీడబ్యూ ప్రథమ మహాసభల గోడ పత్రిక
ఈ మహాసభలకు దేశంలోని 16 రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, జాతీయ నాయకులు హాజరవుతారని ఆమె వివరించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, మద్యపాన నిషేధం, మహిళా హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై ఈ మహాసభల్లో చర్చించనున్నట్టు ఆమె వివరించారు. దీనికి పెద్ద ఎత్తున మహిళలు తరలిరావాలని ఆమె కోరారు.
ఇదీ చూడండి : అప్పు పుట్టని దైన్యం... ఆర్టీసీ కార్మికుల జీవితం దయనీయం!
TAGGED:
గోడపత్రిక