తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా నుంచి బ్యాంకు ఉద్యోగులను కాపాడండి' - మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి బ్యాంకు ఉద్యోగుల ప్రతినిధులు

కరోనా మహమ్మారి బ్యాంకర్లను వదలట్లేదని.. వారిని రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏఐబీఓసీ ప్రతినిధులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వారి సమస్యల గురించి ఎస్​ఎల్​బీసీకు సిఫార్సు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.

request letter to minister niranjan reddy to save bankers from corona
'కరోనా నుంచి బ్యాంకు ఉద్యోగులను కాపాడండి'

By

Published : Jul 21, 2020, 2:33 PM IST

బ్యాంకు ఉద్యోగుల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని.. వారిని రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఏఐబీవోసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.

ఉద్యోగుల సంఖ్యను 50 శాతానికి తగ్గించి.. రోజు మార్చి రోజు విధులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని కోరారు. ప్రతి శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిరంజన్​రెడ్డి.. విధానపరమైన నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోలేనని మంత్రి వెల్లడించారు. వారి సమస్యపై ఎస్​ఎల్​బీసీకు సిఫార్సు చేయనున్నట్లు మంత్రి నిరంజన్​రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:కరోనా ఉద్ధృతికి బ్రెజిల్​లో 80 వేలు దాటిన మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details