రైతు సంఘాల పిలుపుతో నేడు జరగనున్న భారత్ బంద్కు తెరాస మద్దతు పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కేసీఆర్కు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు. వరదల్లో సర్వం కోల్పోయిన రైతులని కేసీఆర్ కనీసం పరామర్శించారా అని నిలదీశారు.
సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీశారు: దాసోజు శ్రవణ్ - Dasoju Shravan on bharath bundh
భారత్ బంద్కు మద్దతు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీశారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కేసీఆర్కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు.
నియంతృత్వ వ్యవసాయంతో రైతులను ఇబ్బందుల పాలు చేసింది కేసీఆర్ కాదా అని శ్రవణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగితే ప్రభుత్వం పోలీసుల చేత అణచి వేయిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ బంద్కు మద్దతిచ్చి.. విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులను, ప్రజాప్రతినిధులను పోలీసులు గృహ నిర్బంధాలు చేయగలరా అని నిలదీశారు. మొన్నటి వరకూ ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక చర్యలకు మద్దతిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు బంద్కు మద్దతు పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: మంగళవారం 'భారత్ బంద్'- అన్ని వర్గాల మద్దతు!
TAGGED:
దాసోజు శ్రవణ్ తాజా వార్తలు