తెరాస ప్రభుత్వం ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తే…కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రకటించారు. ధైర్యం ఉంటే ఐటీఐఆర్ కోసం జంతరమంతర్ వద్ద ధర్నా చేయడానికి రావాలని భాజపా, తెరాసలకు సవాల్ విసిరారు. బండి సంజయ్, కేటీఆర్‌లు ఐటీఐఆర్ విషయంలో లేఖలు రాసుకోవడం సిగ్గు చేటని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు తెరాస మద్దతు ఇచ్చినప్పుడు... ఐటీఐఆర్ విషయంలో ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
'ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకుంటాం' - telangana varthalu
తెరాస సర్కారుకు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందని ప్రకటించారు.
'ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకుంటాం'
భాజపా ఎంపీలు ఐటీఐఆర్ విషయంలో ఎందుకు కేంద్ర ఐటీ శాఖ మంత్రిని అడగడం లేదని నిలదీశారు. ఐటీఐఆర్ అమలు కోసం భాజపా ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. ఐటీఐఆర్ కోసం భూములు, డీపీఆర్‌లు కూడా ఉన్నాయని... దాని కోసం రూ.13 వేల కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇవ్వకుంటే.. రాష్ట్ర సర్కారే ఆ నిధులు కేటాయించి ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి హామీలు నిలబెట్టుకోలేదు: బండి సంజయ్