తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనాలోచిత లాక్​డౌన్​తో పేదల కష్టాలు' - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టిన దాసోజ్‌ శ్రావణ్

కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రకటించిన లాక్‌డౌన్​తో దేశ ప్రజలు అనేక ఇబ్బందలు పడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ పేర్కొన్నారు. పేదల ప్రజలు, రోజువారి కూలీలు, చిన్న, సూక్ష్మ పరిశ్రమదారులు తీవ్ర నష్టపోయారని తెలిపారు.

aicc-spokes-person-dasoju-sravan-speak-on-lockdown-and-migrant-labours-problems
అనాలోచిత లాక్​డౌన్​తో పేదల కష్టాలు'

By

Published : May 28, 2020, 5:17 PM IST

ప్రజలకు ఏ మాత్రం వెసులుబాటు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రకటించిన లాక్​డౌన్​తో వలస కార్మికులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ దేశ వ్యాప్తంగా సామాజిక మాద్యమాల ద్వారా చేపట్టిన ఆన్‌లైన్‌ పోరాటంలో బాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను దాసోజ్‌ శ్రావణ్ ఎండగట్టారు.

ముందుచూపు లేకుండా విధించిన లాక్​డౌన్​తో పేదల ప్రజలు, రోజువారి కూలీలు, ఎమ్​ఎస్​ఎమ్​ఈ సెక్టార్​లో పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వలసకార్మికులను వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించాలి. ఆదాయపు పన్ను పరిధిలో లేని పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి. ఎంజీఎన్‌ఆర్‌జీ కింద రెండు వందల రోజులు పని కల్పించాలి. -ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌

అనాలోచిత లాక్​డౌన్​తో పేదల కష్టాలు'

ఇదీ చూడండి:మిడతలపై పోరులో.. మోగిన సైరన్​లు, ఎగిరిన డ్రోన్​లు!

ABOUT THE AUTHOR

...view details