దుబ్బాక ఉపఎన్నికలో సీఎం కేసీఆర్‌కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. మల్లన్నసాగర్ రైతుల ఉసురు ఇక్కడ తగిలిందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో దుబ్బాకలో గెలవాలన్న సీఎంకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు.
రఘునందన్‌రావుకు అభినందనలు : దాసోజు శ్రవణ్‌కుమార్ - గాంధీభవన్ వార్తలు
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టులాంటిదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలకున్న తెరాసకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. విజయం సాధించిన భాజపా అభ్యర్థికి ఆయన అభినందనలు తెలియజేశారు.
దుబ్బాక ఫలితం కేసీఆర్‌కు చెంపపెట్టు : దాసోజు శ్రవణ్‌కుమార్
ఈ ఎన్నికలో విజయం సాధించిన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్‌రావుకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. దుబ్బాకలో ఓటమిపై లోతైన సమీక్ష నిర్వహిస్తామని...కార్యకర్తలెవ్వరూ అధైర్యపడవద్దని ఆయన సూచించారు.