నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణలో ఏవీ నెరవేరడం లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలపై ఆశతో ఉన్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 2.70 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ... ఆరేళ్లలో కనీసం 30వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. పట్టభద్రులు అంతా ఓటరుగా వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగాల భర్తీకి చర్యలు శూన్యం : వంశీచంద్‌రెడ్డి
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. నీళ్లు , నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ఎల్ఆర్ఎస్తో ప్రభుత్వం కొత్త దోపిడికి తెరతీసిందన్నారు.
ఉద్యోగాల భర్తీకి చర్యలు శూన్యం : వంశీచంద్‌రెడ్డి
ఎల్ఆర్ఎస్తో పేద ప్రజలను దోచుకునేందుకు తెరలేపిందని ఆరోపించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సర్కారుకు ప్రజలు బుద్ధి చేప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ , ఐఆర్ ప్రకటించాలని... సీపీఎస్ విధానంపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని కోరారు.