సికింద్రాబాద్ చిలకలగూడలోని బస్తీలో ఉన్న పేద ప్రజలకు ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
కరోనా నుంచి కాపాడుకుందాం: గూడూరు నారాయణ రెడ్డి - నిత్యావసర సరుకులను పంపిణీ
సికింద్రాబాద్లో నిరుపేదలకు ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి శానిటైజర్స్, మాస్కులు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 15వేల మందికి సాయం చేసినట్లు ఆయన తెలిపారు.
కరోనా నుంచి కాపాడుకుందాం
ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 15 వేల మందికి పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, స్వీయ నియంత్రణ, భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రజలంతా నడుచుకుంటే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చునని ఆయన పేర్కొన్నారు.