ఫార్మా హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో వ్యాక్సిన్, రెమెడెసివర్ ప్రజలకు దొరకడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. నిన్నటి వరకు ఏవైనా ఇబ్బందులు ఉంటే.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు చెప్పుకునే వాళ్లమని... ఇప్పుడు ఎవరికి చెప్పు కోవాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి' - telangana news today
ఫార్మా హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో... ప్రజలకు కరోనా మందులు, టీకాలు దొరకడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్య సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా ఉద్ధృతి అధికమై అల్లకల్లోలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటలను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను నిలువు దోపిడి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అవసరమైతే ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్మీ సహాయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు తక్షణమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతామని చెప్పి ఆరు నెలలు అవుతున్నా... ఇంత వరకు అతీగతి లేదని ఎద్దేవా చేశారు.