భాజపా ప్రభుత్వం చెప్పే మాటలు తీయగున్నా... ప్రతిపాదనలు మాత్రం చాలా చేదుగా ఉన్నాయని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రెండున్నర గంటల సుధీర్ఘ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రధాన మంత్రి నవ్వలేరని... నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపులపై చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వారి మొహం చూస్తేనే అర్థమైందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టు కింద రైల్వేను మార్చడం అంటే సర్కార్ తన బాధ్యత నుంచి తప్పుకోవడమేనని దుయ్యబట్టారు. ఎల్‌ఐసీలో వాటాల విక్రయం దారుణమన్నారు.
'మాటలు తీయగా.. ప్రతిపాదనలు చేదుగా..' - ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
రెండున్నర గంటల సుధీర్ఘ బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ పెదవి విరిచింది. ఆర్థిశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంస్కృత పదాలు వాడి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు తప్ప ఒరగబెట్టిందేమిలేదంటూ మండిపడ్డారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి.
'మాటలే తీయ్యగా.. ప్రతిపాదనలు చాలా చేదుగా..'
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రైవేటు సంస్థల కోసమే పెట్టినట్లుగా ఉందని కోదండరెడ్డి ఆరోపించారు. బడ్జెట్ సామాన్య ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనంలేదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు తప్ప కూలీలకు లబ్ధి చేకూరేలా లేదని ఆయన ఆక్షేపించారు. అదే విధంగా కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లాభంలేదని చెప్పారు. దేశ ఆర్థిక ప్రగతికి ఏలాంటి చర్యలు లేవని విమర్శించారు. వ్యవసాయాభివృద్దికి చేసిందేమిలేదన్నారు.
ఇవీ చూడండి: 'ప్రజలకు అవసరమైన చోట పనిచేయాలి'