ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జన్మదిన వేడుక సందర్భంగా... ఏఐసీసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ గాంధీ భవన్‌లో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ, అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు. కొవిడ్ -19 నివారణలో ముందుండి పని చేస్తున్న ఫ్రంట్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమాలను పార్టీ నాయకులు, శ్రేణులు విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ భవన్‌లో రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరు వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఉత్తమ్ ప్రారంభించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి 50వేల రూపాయల చెక్కును అందచేశారు.