తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేతకు దిల్లీ నుంచి పిలుపు - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేతను దిల్లీకి రావల్సిందిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. గురువారం దిల్లీలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలను, సీఎల్పీ నేతలను ఆదేశించినట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.

AICC calls on state leaders to come to Delhi
ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేతకు దిల్లీ నుంచి పిలుపు

By

Published : Dec 23, 2020, 7:50 PM IST

కాంగ్రెస్​ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు అందింది. ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేత దిల్లీకి రావల్సిందిగా ఏఐసీసీ ఆదేశించింది. గురువారం దిల్లీలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలను, సీఎల్పీ నేతలకు ఈ పిలుపు ఉన్నట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు.

ఇదీ చదవండి:కొత్తరకం కరోనా వైరస్‌తో బీ అలర్ట్​: ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details