తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్రిగోల్డ్ ఆస్తులమ్మండి..! - PROTEST

రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు గళమెత్తారు. ఏపీ తరహాలో తమను ఆదుకోవాలంటూ ధర్నాకు దిగారు. సంస్థ ఆస్తులు విక్రయించి... తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

అగ్రిగోల్డ్ ఆస్తులమ్మండి..!

By

Published : Feb 27, 2019, 8:09 PM IST

Updated : Feb 27, 2019, 11:08 PM IST

అగ్రిగోల్డ్ ఆస్తులమ్మండి..!
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్ సిటిజన్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.250కోట్లుచెల్లించారని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలను నష్టపరిహారం ఇచ్చారని అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ బాబు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ బాధితుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

స్థిరాస్తులు స్వాధీనం చేసుకోండి:

అగ్రిగోల్డ్ యాజమానికి చెందిన స్థిరాస్తులు తెలంగాణలోనూ ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:త్యాగాలపై రాజాకీయామా!

Last Updated : Feb 27, 2019, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details