‘పదవీ విరమణ అనంతరం వచ్చిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో దాచుకున్నా. ఆ కంపెనీ మోసం చేయడంతో.. ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేసి వేలం వేసింది. వచ్చిన సొమ్మును హైకోర్టులో డిపాజిట్ చేసింది. అందులో నుంచి నా సొమ్మును వాపసు ఇప్పించేలా ఆదేశాలివ్వండి'’అని కోరుతూ 72 ఏళ్ల రవికాంత్‌సిన్హా అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.26.4 లక్షలు డిపాజిట్ చేశానని, 6 ఏళ్లయినా సొమ్ము వాపసు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పోలీసులకూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
క్యాన్సర్ బారినపడిన తన భార్యకు.. నగదు లేక వైద్యం చేయించలేకపోవడంతో ఆమె చనిపోయిందని, కుమారుడు వేరుగా ఉంటున్నారని, వృద్ధాప్యంలో జీవనం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు తెలంగాణలోనూ ఉన్నారని, సంస్థకు చెందిన ఇక్కడి ఆస్తులను విక్రయించగా వచ్చిన సొమ్ము హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేశారని చెప్పారు. ఆ మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం రూ.900 కోట్లు అక్కడి డిపాజిట్‌దారులకు చెల్లించిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అగ్రిగోల్డ్‌పై ఇతర పిటిషన్లతో పాటు దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని పేర్కొంది.
మరో పిటిషన్..