హైదరాబాద్‌లో రబీ సీజన్‌కు అవసరమైన ఎరువుల కేటాయింపులు, సరఫరా, నిర్వహణ వంటి అంశాలపై రైల్వే ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే విభాగం నుంచి ఉన్నతాధికారులు కె.శివప్రసాద్, జి.జాన్ ప్రసాద్, మనోజ్ శ్రీవాస్తవ, బీఎస్ క్రిస్టోఫర్, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, అదనపు సంచాలకులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎరువులను తెలుగు రాష్ట్రాలకు త్వరితగతిన రైలు మార్గం సరఫరా, పంపిణీ కోసం ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించారు. అక్టోబరు నెలలో తెలంగాణకు కేటాయించిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సకాలంలో పంపిణీ చేయడానికి తగిన సంఖ్యలో రైల్వే ర్యాకులను అందుబాటులో ఉంచాలని రైల్వే అధికారులను పార్థసారథి కోరారు.
యూరియా నిల్వలపై సర్కార్ ముందు జాగ్రత్త - Agriculture PRINCIPAL SECRETARY
రబీ సీజన్ ఎరువుల సరఫరాపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లో రబీ సీజన్‌కు అవసరమైన ఎరువుల కేటాయింపులు, సరఫరా, నిర్వహణ వంటి అంశాలపై రైల్వే ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఎరువులను సకాలంలో సరఫరా చేసే అంశంపై చర్చించారు.
![యూరియా నిల్వలపై సర్కార్ ముందు జాగ్రత్త](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4861585-524-4861585-1571941026931.jpg)
యూరియా నిల్వలపై సర్కార్ ముందు జాగ్రత్త