రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసిన తర్వాత తరుగు తీశారని ఫిర్యాదులు వస్తే సంబంధిత కేంద్రాల నిర్వాహకులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. ఒకసారి కొన్న తర్వాత తేమ, ఇతర కారణాలు చూపి తరుగు వేస్తే తమకు తెలియజేయాలని మంత్రి సూచించారు. జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతూ... రైతులను మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన జారీ చేశారు.
'ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు' - వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి
ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై రైతులు తమకు ఫిర్యాదు చేయాలని ఓ ప్రకటనలో సూచించారు.
వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి