niranjan reddy visit horticultural crops: ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రైతులు విత్తనం మంచిదో, నకిలీదో ముందుగానే తెలుసుకునే వీలుంటుందని తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా బల్లిపొర మండలం వల్లబాపురంలో ఉద్యాన పంటలను మంత్రి పరిశీలించారు. సేంద్రీయ విధానంలో పండ్లతోటలు సాగు చేస్తున్న విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఒకే ప్రాంతంలో భిన్నమైన ఉద్యానపంటల సాగుని అధికారులు మంత్రికి వివరించారు.
ఏపీలో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వినూత్నమైన పద్ధతుల్లో వ్యవసాయాన్ని బలోపేతం చేసినం. మాకు అనుకూలమైన పద్ధతుల్లో నిర్ణయాలు తీసుకున్నాం. మా వద్ద వరంగల్ జిల్లా పరకాలలో అరటి తోటలు పెంపకం పెరిగింది. అగ్రి టెస్టింగ్ ల్యాబోరేటరీ చాలా ఉపయోగకరం. రైతుల వినియోగించేముందు విత్తనాలను టెస్టింగ్ చేయడం మంచి ఆలోచన. ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఈ విధానాన్ని ప్రత్యక్షంగా చూసేందుకే వచ్చా. - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి