తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Review On Crops: రైతుల దృష్టి మళ్లించడం అసాధ్యమేమీ కాదు: నిరంజన్​రెడ్డి - మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

యాసంగిలో ఇతర పంటలపై రైతులు దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy niranjan reddy) సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు కృషి చేయాలన్నారు. హైదరాబాద్​లోని నాంపల్లిలో తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో 'యాసంగి-సాగుకు సమాయత్తం'పై రాష్ట్రస్థాయి జిల్లా వ్యవసాయ అధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Minister Review On Crops
'యాసంగి-సాగుకు సమాయత్తం'పై రాష్ట్రస్థాయి జిల్లా వ్యవసాయ అధికారుల సమావేశంలో పాల్గొన్న మంత్రి

By

Published : Nov 13, 2021, 5:07 PM IST

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో వరి సాగు నుంచి రైతుల దృష్టి మళ్లించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Singireddy niranjan reddy) అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎఫ్‌సీఐ(FCI) నిర్ణయంతో తాజా యాసంగిలో(review on yasangi crops) ప్రత్యామ్నాయ పంటల సాగు, విత్తనాల లభ్యత, రసాయన ఎరువుల వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో యాసంగి - సాగుకు సమాయత్తంపై జరిగిన రాష్ట్ర స్థాయి జిల్లా వ్యవసాయ అధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా పంటల మార్పిడి, వైవిధ్యీకరణపై లఘు దీపిక, గోడపత్రిక, రైతు వేదికల వ్యాసదీపికను మంత్రి విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు కృషి చేస్తే రైతుల దృష్టి మళ్లించడం అసాధ్యమేమీ కాదని మంత్రి స్పష్టం చేశారు. రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. వరికి బదులుగా మినుములు, పెసర్లు వేయడం వల్ల వానాకాలం సాగులో ఎరువుల వాడకం తగ్గించవచ్చని చెప్పాలని సూచించారు. కుసుమలు, ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా చూడాలన్నారు. ఆముదాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా... మనదేశంలో తగినంత ఉత్పత్తి లేదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy niranjan reddy) తెలిపారు.

ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించండి

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌(oil palm) సాగును ప్రోత్సహించడంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. డీఏపీ మన భూములకు అక్కర్లేదని... రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం తగ్గించేలా రైతులను చైతన్యం చేసి పంట పెట్టుబడి తగ్గేలా చూడాలని సూచించారు. రైతు వేదికల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యాక వ్యవసాయ రంగంలో అనేక మార్పులపై సమీక్ష(review on yasangi crops) నడుస్తూనే ఉందని పేర్కొన్నారు. యాసంగిలో వరి సాగు వద్దనే పరిస్థితి రావడం బాధాకరమని.. దేశంలో ఆహారాధాన్యాలను సమతుల్యం చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి ఆక్షేపించారు. దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి సాధించే రాష్ట్రం తెలంగాణే(telangana) అని స్పష్టం చేశారు. పప్పు గింజలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నందున రైతులకు అర్థమయ్యేలా చెప్పేందుకు రాష్ట్ర స్థాయిలో వ్యవసాయశాఖ బృందాలను తయారు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి (Singireddy niranjan reddy) పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:

Minister Niranjan Reddy: 'తగ్గించిన కోటాను మార్చిలోగా పంపించండి'

Minister Niranjan Reddy : నల్ల చట్టాలతో రైతులను వంచించే కేంద్రానికి.. ఆ శక్తి లేదా?

Niranjan Reddy: నకిలీ విత్తనాలను ఉపేక్షించేది లేదు: నిరంజన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details